Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద మంది విద్యార్థులకు రెడీమేడ్ దుస్తులు పంపిణీ…

విశాలాంధ్ర-గుంతకల్లు : ఇంటర్నేషనల్ హ్యాపీనెస్డే అదేవిధంగా ఉగాది వేడుకలను పురస్కరించుకొని మండలంలోని తిమ్మాపురం గ్రామంలో బుధవారం ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంపీపీ జడ్పీహెచ్ పాఠశాలలో అధ్యక్షురాలు త్రిష్లా బన్సాలి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథులు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, తిమ్మాపురం సర్పంచ్ నక్క నీలమ్మ ,ఎంపీటీసీ బాబురావు,ధాత దినేష్ ధనరాజ్ భన్సాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి చేతుల మీదుగా వందమంది విద్యార్థులకు రెడీమేడ్ డ్రస్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.వి.ఆర్ మాట్లాడుతూ… ఇన్నర్ విల్ క్లబ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత చురుగ్గా ముందుకెళ్తూన్న కమిటి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఎమ్మెల్యే వై.వి.ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రామాంజనేయులు, ఐడబ్ల్యుసి సభ్యులు అనురాధ గుప్త, విజయ, ప్రశాంత్ ,పాఠశాల ప్రిన్సిపాల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img