Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ పిచ్చివాడిలా దండయాత్ర…

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించేందుకు ఇదే మంచి సందర్భం…

నిరంతరం సమస్యలపై పోరాడే కత్తి ,పోతుల, గోపాల్ లను గెలిపించండి

జీవో ఒకటిపై ఈనెల 20 న చలో అసెంబ్లీ ముట్టడికి అన్ని పార్టీల ప్రజా సంఘాలు తరలి రండి…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ…

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో విధ్వంస అరాచక పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలతో పట్టభద్రులు ఉపాధ్యాయులు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి అవకాశం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు.శనివారం గుంతకల్లు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కే రామకృష్ణ మాట్లాడుతూ..ఇవాళ రాష్ట్రంలో ఐదు స్థానాల్లో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని అయితే రాష్ట్రవ్యాప్తంగా చర్చాన్సియంగా మారిందని అన్నారు. అందులో లోకల్ బాడిస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సాదిస్తున్నారని అన్నారు. అవి కూడా వివాదస్పదంగా మరిందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పిచ్చి పట్టిందేమో అర్థం కాలేదన్నారు.అంటే అన్ని నేనే ఉడాలి ఎవరు కనబడకూడదు ఎవరు సబలో ఉండకూడదు ఎవరు ప్రతిపక్షాలు ఉండకూడదు మాట్లాడేవారు ఉండ కూడదు ప్రజా సమస్యలు లేవనెత్తేవారు ఉండకూడదు ఎంత దిగజారాడంటే దొంగ ఓట్లు డబ్బులు పంచడం ఇలాంటివి చూసాము గాని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా నామినేషన్ వేసేకి రానీయకుండా చేసే విధంగా చేస్తున్నాడని మండిపడ్డారు.ఆఖరికి నామినేషన్ వేయడానికి మారువేషన్లో బుర్కాలు వేసుకొని కలెక్టర్ ఆఫీసు గోడలు దుంకి నామినేషన్ వేసే పరిస్థితిని దిగదర్చాడని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ని ఏమనాలో తెలియడం లేదన్నారు.150 మంది ఎమ్మెల్యేలు అడ్డమే లేదు నీకేమి వచ్చింది ఆ పని చేయకుండా అన్ని నాకే కావాలని లోకల్ బాడీస్ లో అంత మీ వాళ్లే కదా నీవు బీఫామ్ ఇచ్చిన మీ వాళ్ల పైనే ఓట్లు వేస్తారా లేదా అనేదానికి నమ్మకం లేదా అని ఓట్లు వెయ్యరనే నమ్మకం పైనే ఏకగ్రీవాలకు అడుగులు వేస్తున్నాడని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి,చంద్రబాబు నాయడు,కిరణ్ కుమార్ రెడ్డి గాని ఇలా దండయాత్రలు చేయలేదని అన్నారు.ప్రత్యెక్షంగా ఎమ్మెల్సి ఎన్నికలలో దండయాత్రచేస్తున్నాడని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి పున్యామాఅని ఒక మహిళకు 18 మొగులంటా అని ఇంత దిగజారాడని అన్నారు.ఒక సెల్ ఫోన్ నంబర్ పైన 75 ఓట్లు వేశారని ఆరోపించారు.సిగ్గు లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు.పట్టబద్రులను,టీచర్స్ లను అదికారులతోను పైృవేట్ వ్యక్తులతోనూ బెదిరిస్తున్నావని అన్నారు. ప్రతి టీచర్ కి 5000 రూపాయలు పట్టభద్రులకు 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి మనుషులను పెట్టి డబ్బులు పంచుతున్నారని అన్నారు. మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకున్న డబ్బుతో ఈరోజు ఓటర్లు కొనే ప్రయత్నం చేస్తున్నావన్నారు. శాసనమండలి లో అడుగు పెట్టే అర్హత నీకు లేదన్నారు. అసెంబ్లీలో శాసనమండలే అవసరం లేదని తీర్మానం చేసి డిల్లికి పార్లమెంటుకు పంపించావని ఈరోజు ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దండయాత్ర చేస్తున్నావన్నారు. వైసిపి అభ్యర్థులకు ఓటు వేయండి టీచర్లకు ఉద్యోగస్తులకు ఒకటో తారీకు కరెక్టుగా జీతాలు ఇస్తామని అంటున్నావ్ నువ్వేమైనా ఊర్కెనే జీతాలు ఇస్తున్నావా విధులు నిర్వహిస్తున్నందుకు ఇస్తున్నావ్ ఒకటో తారీకు జీతాలు ఇవ్వడం నీ బాధ్యత అన్నారు. బుగ్గన రాజేంద్రప్రసాద్ కి కరెక్ట్ గా జీతం పడుతుందని ఆయన ఢిల్లీకి ఇతరా దేశాలకు వెళ్లి అప్పులు ఫైనాన్షియల్ గా తెస్తున్నందుకు కరెక్ట్ గా జీతం ఇస్తున్నారని 15 రోజులైనా ఉద్యోగులకు జీతం ఆవ్వలేని పరిస్థితి ఉందన్నారు.చిన్న చిన్న వర్కర్లకు 5 మాసాలైనా జితాలు ఇవ్వడం లేదన్నారు.విధ్యావంతులు మేధావులు,డాక్టర్లు,ఇంజినేర్లు,పట్టభధ్రులు,ఉపాధ్యాయులకు మంచి అవకాశం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వానికి భుద్ది చెప్పేందుకు వైసీపీ అభ్యర్దులను ఓడించేందుకు ఇదే సందర్భంగా అని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి కి మొదటి ప్రాధాన్యత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకి రెండవ ప్రాధాన్యత భూమ రెడ్డి గోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతిపక్షాల నోరు నొక్కడానికి,ప్రజా సంఘాలు రోడ్లలో దర్నాలు రాస్త రోకులు చేయకుండా అడ్డుకునేందుకు జీవో నంబర్ 1 ని తీసుకువచ్చారని దాని పర్మిషన్ లు ఆవ్వరని టిడ్కో ఇల్లపై జగనన్న ఇల్ల పై విజయవాడలో నిరసనకు పరిమీషన్ ఇవ్వకుండా దర్నాను అడ్డుకునేందుకు పోలీసులు గుృహనిర్బందాలు,అరెస్టులు చేశారన్నారు.జీవో 1 పై ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏర్పడిందని 25వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిచ్చారని భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఈనెల 20వ తారీఖున 26 జిల్లా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అందరూ తరలిరాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బి.మహేష్ సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, పామిడి సిపిఐ మండల కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img