కోర్టు ప్రాంగణంలో సమస్యలు ఎమ్మెల్సీ దృష్టి సారించలని వినతి
విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు మరియు వారి మిత్రులు శనివారం అనంతపురంలోని పెనుకొండ వాసి ఎమ్మెల్సీ మంగమ్మను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి స్వీట్లు అందజేశారు శాలువాతో సన్మానించారు .ఇటీవల బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజును మరియు ఇతర సభ్యులను ఎమ్మెల్సీ మంగమ్మ అభినందించారు ఇద్దరము ఒకే గ్రామానికి చెందిన వారమనీ చాలా ఆప్యాయంగా పలకరించారు న్యాయవాదుల సంఘంఎన్నికలలో విజయం సాధించడం సంతోషకరమని ఆమె తెలిపారు వీరు అనంతరం పెనుకొండ కోర్టు నందు నెలకొన్న సమస్యలపై నాగరాజు ఎమ్మెల్సీ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు కోర్టు ప్రాంగణంలో ఇప్పుడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మరియు సబ్ కోర్టు నడుస్తున్నందున కోర్టుకు కోర్టు సిబ్బందికి కానీ న్యాయవాదులకు కానీ సరైన వసతులు లేవని నూతన భవనాలు నిర్మించాలని అలాగే కోర్టు ప్రాంగణంలో నెలకొన్న సమస్యలు తెలిపారు ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు శంకర నారాయణతో కలిసి సమస్యలపై చర్చించి ఇద్దరు కలిసి ప్రభుత్వంతో చర్చించి అదనపు జిల్లా కోర్టు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని కోర్టు జడ్జిలకు విశ్రాంతిభవనము మరియు ఛాంబర్ లు ప్రాంగణమునందు పార్కింగ్ సౌకర్యం, సిబ్బందికి తగిన భవనాలు లేవని కావున కేస్ ఫైల్ పెట్టుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు లేవని వీటిపై వెంటనే శ్రద్ధ చూపాలని నాగరాజు ఎమ్మెల్సీ కు విన్నవించారు వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు కృషి చేస్తానని పెనుకొండ కోర్టు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కనీస సదుపాయాలు కల్పించుటకు కృషి చేస్తామని న్యాయవాదులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు లైబ్రరీ సెక్రెటరీ విక్రాంత్ నాయక్, న్యాయవాదులు శివశర్మ, నాగిరెడ్డి , బాలాజీ, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.