Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డికి సన్మానం

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో 42 అంగన్వాడీ సొంతభవనాల నిర్మాణానికి ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి కృషిచేసి మంజూరు చేయించడంతో నియోజకవర్గంలోనే పలు గ్రామాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు శనివారం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎమ్మెల్సీ నివాసంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు కు సొంత భవనాలు లేక ఇబ్బందులకి గురయ్యామని సొంత భవనాలు మంజూరు కావడం ఇందుకు ఎమ్మెల్సీ కృషి చేయడం అర్షనీయమని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 64 సొంత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ ని కోరడంతో ఆమె వెంటనే స్పందించి 42 భవనాల నిర్మాణానికి అనుమతులను మంజూరు చేయించిందని త్వరలోనే మరో 22 భవనాలు నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ పద్మావతి. ఉద్యోగులు జయలక్ష్మి మహేశ్వరి, మునెమ్మ,సువర్ణ,ఈరమ్మ వీరితో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img