Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

విశాలాంధ్ర- పెనుకొండ: పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మంగళవారం సబ్ కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన డివిజనల్ స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశము నందు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు వేధింపుల నిరోధక చట్టం 1989 సక్రమంగా అమలుపరచాలని మరియు బాధితులకు న్యాయం, ఉపశమనం మరియు పునరావాసం విషయాల గురించి మరియు అంటరాని తనం నిర్మూలనకు చర్యలగురించి చర్చించటం జరిగినది.ఈ సమావేశమునకు నకు డివిజనల్ స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అయిన పెనుకొండ తహశీల్దారు, సువర్ణ ఎంపిడిఓ శివ శంకరప్ప , అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ హిందూపురం జిల్లా ప్రాదేశిక సభ్యులు గుదిబండ , జిల్లా ప్రాదేశిక సభ్యులు మడకశిర జిల్లా ప్రాదేశిక సభ్యులు, రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్ మరియూ ఇతర ఎన్జీవో సభ్యులు హాజరవడం జరిగినది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img