Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ఒ.ప్రణతి ఆధ్వర్యంలో శనివారం రాజ్యాంగదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంగ్లశాఖ ఆచార్యులు వి.వి. ఎన్‌. రాజేంద్రప్రసాద్‌, ఆర్థికశాఖ ఆచార్యులు ఎమ్‌.డి. బావయ్య రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.వి.ఎన్‌. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ… భారతదేశం ఒక మతమైతే, ఆ మతం గురించి వివరించే ఒకే ఒక్క పుస్తకం రాజ్యాంగం అన్న ప్రధాని మోదీ మాటలను గుర్తుచేశారు. రాజ్యాంగ రూపకల్పనకు దాదాపు మూడేళ్లు పట్టిందన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగానికి సంబంధించిన తన చివరి ఉపన్యాసంలో మన రాజ్యాంగం రాజకీయమైనది కాదు, సామాజికమైనదని అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చారు. లక్ష, పదిహేడువేల, మూడువందల అరవై తొమ్మిది పుటల్ని ప్రేమ్‌ బిహారి చేతిరాతతో ఇటాలిక్‌ స్టైల్లో రాజ్యాంగాన్ని రాశాడని తెలియజేశారు. మనది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img