Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

ఐ ఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో హైజినిక్ కిట్స్ అందజేత

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ శుక్రవారం ఁప్రపంచ ఆరోగ్య దినోత్సవంఁ పురస్కరించుకొని ఈ సంవత్సరం థీమ్ అయిన ఁఅందరూ ఆరోగ్యంగా ఉండాలనిఁ అనే విషయాన్ని అందరికి తెలియజేయడం జరిగింది. గోరంట్ల లోని పులేరు రోడ్ అక్షర జ్యోతి శిక్షణా కేంద్రంలో వలసదారులకు రెడ్ క్రాస్ తరుపున 60 హైజినిక్ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ జి ఎం శేఖర్ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కొరకు పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జీవన ప్రమాణాలు పెంపొందించుకోవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.బి విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్న వనరులతోనే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం గా ఉండాలని
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఖాదీ బోర్డ్ వైస్ చైర్మన్ చంద్రమౌళి గారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ఇలాంటి నిస్సయకులకు అవగాహన పెంచి సేవ చేయడం చాల గొప్పదన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబెర్ సాయి దర్శిని మేడం, రెడ్ క్రాస్ జీవిత సభ్యులు సురేష్,జగదీష్,శ్రీనివాసులు,కోఆర్డినేటర్ బి. రమేష్, వాలంటర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img