ప్రిన్సిపాల్ రఘునాథ రెడ్డి
విశాలాంధ్ర-ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథ్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఈనెల 27వ తేదీ మాత్రమే చివరి గడువు కలదని తెలిపారు.