Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు

విశాలాంధ్ర..ధర్మవరం : పట్టణములోని శ్రీనివాస నగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భక్తాదులు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అర్చకులు రాజేష్ ఆచార్యులు వేదమంత్రాలు,మంగళ వాయిద్యాలు నడుమ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పట్టణ పురవీధుల గుండా సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, జింక రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ ఆలయ కమిటీ దాతల సహాయ సహకారములతో ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ పురవీధుల్లో భక్తాదులు స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, చెన్నం శెట్టి శ్రీనివాసులు, చెన్నం శెట్టి రమేష్ కుమార్, డైరెక్టర్లు, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img