Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

కాంస్య పథకం సాధించిన శ్రీ సత్య సాయి జిల్లా హాకీ జట్టు

విశాలాంధ్ర -ధర్మవరం : ఆంధ్రప్రదేశ్‌ హాకీ ఆధ్వర్యంలో నంద్యాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 13వ రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలుర హాకీ పోటీలలో శ్రీ సత్య సాయి జిల్లా జట్టు తృతీయ స్థానమును కైవసం చేసుకున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ మొదటి రోజు జరిగిన లీగ్‌ మ్యాచ్లో విజయనగరం జిల్లా జట్టుపై 3-0, ఎన్టీఆర్‌ జిల్లా జట్టుపై 6-0, రెండవ రోజు ఏలూరు జిల్లా జట్టుపై 4-1 స్కోరుతో విజయం సాధించిందని మధ్యాహ్నం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్లో గత ఏడాది విజేత విశాఖపట్నం జిల్లా జట్టుపై విజయం సాధించడం జరిగిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన మహమ్మద్‌ రఫీ హ్యాట్రిక్‌ గోల్స్‌ తో సాధించడం మ్యాచ్‌ నిర్ణీత సమయంలో ఇరుజట్లు 3-3 స్కోర్‌ తో డ్రా అయ్యిందని పెనాల్టీ షూట్‌ అవుట్‌ లో 3-1 స్కోరుతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుందన్నారు. సెమీ ఫైనల్‌ లో సత్యసాయి జిల్లా జట్టు అనకాపల్లి జిల్లా జట్టుతో తలపడి 3-1 స్కోరుతో ఓటమిపాలు కాగా మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కడప జిల్లా జట్టుతో తలపడి నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1 స్కోరుతో డ్రా అయిందన్నారు. పెనాల్టీ షూట్‌ అవుట్‌ లో 2-1 స్కోర్‌ తేడాతో విజయం సాధించి కాంక్ష పథకమును సొంతం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన జిల్లా జట్టుకు నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు చాణుక్యరాజు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రవికిరణ్‌ చేతుల మీదుగా బహుమతులను అందుకోవడం జరిగిందన్నారు. తదుపరి విజయం సాధించిన జట్టు సభ్యులను, కోచ్‌ హసేన్‌, హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్‌ ,శ్రీనివాసులు, బండి వేణుగోపాల్‌, పళ్లెం వేణుగోపాల్‌, అంజన్న, గౌరీ ప్రసాద్‌ తో పాటు సీనియర్‌ క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img