Monday, June 5, 2023
Monday, June 5, 2023

కాలేయ వ్యాధిని ముందస్తుగా గుర్తించి తగిన వైద్య చికిత్సలను పొందాలి..

స్పందన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అర్జున్
విశాలాంధ్ర -ధర్మవరం : కాలేయ వ్యాధిని ముందుగా గుర్తించి, తగిన వైద్య చికిత్సలను తప్పనిసరిగా పొందాలని స్పందన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అర్జున్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం అంతర్జాతీయ కాలేయ (లివర్) దినోత్సవం సందర్భంగా రోగులకు ప్రజలకు తగిన జాగ్రత్తలు, సలహాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ సాధారణ ప్రజలలో కాలేయ వ్యాధి గురించి అవగాహన మరింత పెంపొందించేందుకే అంతర్జాతీయ కాలేయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కాలేయ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి నివారణ కొరకు తగిన వైద్య చికిత్సలను పొందితే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని వారు తెలిపారు. మద్యపానం సేవించడం వలన కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రమాద స్థాయికి చేరుకుంటుందన్నారు. శరీరంలోనే అతిపెద్ద, అత్యంత కీలకమైన అవ్యయము కాలేయమన్నారు. కాలేయం జీవక్రియ, జీర్ణ క్రియ, రోగ నిరోధక శక్తి, టాక్సిన్స్, వడబోత, విటమిన్లు, ఖనిజాలు, గ్లూకోజ్ మొదలైన వాటి నిల్వకు మాత్రమే పరిమితం కాకుండా, అనేక విధులను నిర్వర్తించడం కాలేయం యొక్క పని అని వారు తెలిపారు. కాలేయమును ఏదైనా అపాద రణతలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు అని తెలిపారు. క్రమం తప్పకుండా లివర్ పరీక్షలు చేయించుకోవాలని ఫ్యాటీ లివర్ ఎవరినైనా ప్రభావితం చేస్తుందని తెలిపారు. మద్యపానం లేని రోగులలో వచ్చే కాలేయ వ్యాధి తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న రోగులలో గమనించబడుతాయని వారు తెలిపారు. వ్యాధి తీవ్రత సంబంధిత ప్రమాద కారకాలు నివారణకు సంబంధించి అవగాహన లేకపోవడమే కాలేయ వ్యాధి సంఖ్యల పెరుగుదలకు కారణమని తెలిపారు. చక్కటి ఆహారాన్ని భుజించాలని, వ్యాయాయం కూడా తప్పనిసరి చేయాలని, జీవనశైలి మార్పులతో సహా దాని నివారణ గూర్చి ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. చాలా రకమైన కాలేయ వ్యాధులు లక్షణ రహితంగా ఉంటాయని తెలిపారు. ఆరోగ్యకరమైన కాలేయం కోసం మానవ కాలేయం నిర్వీషికరణకు శరీరం యొక్క ప్రాథమిక ఆవయమని తెలిపారు. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని, వ్యాయామం, ధ్యానం చేయాలన్నారు. సొంతంగా మందులను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలని కలుషితమైన సూదులు అసూ రక్షిత సెక్స్ ను పంచుకోవడం మానుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img