మధ్యస్థాయి ఆస్పత్రుల విభాగంలో సీఎస్‌డీ 2000కు గాను సేవల్లో నాణ్యతకు పురస్కారం
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం నగరానికి చెందిన కిమ్స్ సవీరా ఆస్పత్రికి ప్రతిష్ఠాత్మకమైన సౌత్ జోన్ ఃది కన్సార్టియం ఆఫ్ అక్రెడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్ః (కాహో) అవార్డు వచ్చింది. కన్సార్షియం ఆఫ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్ ఏడో అంతర్జాతీయ సదస్సు కాహోకాన్ హైదరాబాద్‌లోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఆ సందర్భంగానే కిమ్స్ సవీరా ఆస్పత్రికి సేవలలో నాణ్యతకు పెద్దపీట వేసినందుకు గాను పురస్కారం అందించారు. ఫిజికల్ ఆడిట్ స్కోర్లలో కనీసం 80% సాధించిన ఆస్పత్రులకు ఏస్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే, కిమ్స్ సవీరా ఆస్పత్రి 95% స్కోరు సాధించి అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో దక్షిణాది ప్రాంతానికి అవార్డు దక్కించుకుంది. తద్వారా భారతదేశంలో ఈ అవార్డు పొందిన 5 ఆస్పత్రులలో ఒకటిగా నిలిచింది.
ఈ సందర్భంగా కిమ్స్ సవీరా ఆస్పత్రి ఎండీ కిశోర్ రెడ్డి మాట్లాడుతూ, ాారోగులకు సురక్షితమైన, ఉత్తమ, నాణ్యమైన సంరక్షణను అందించడమే ఏ ఆసుపత్రికైనా లక్ష్యంగా ఉంటుంది. నోసోకోమియల్ ఇన్ఫెక్షన్లను నివారించడం సురక్షితమైన చికిత్స అందించడంలో అతిపెద్ద సవాలుగా మారింది. ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ రేటును తగ్గించడంలో సీఎస్ఎస్‌డీ పోషించే కీలక పాత్రను మరీ ఎక్కువగా చెప్పలేం. అయినా ఇది పొందవలసినంత గుర్తింపును పొందదు్ణ్ణ అన్నారు.
క్వాలిటీ, పేషెంట్ సేఫ్టీ విభాగాధిపతి డాక్టర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ, ాాసీఎస్ఎస్‌డీ విభాగం పరిధి గతంలో ఆటోక్లేవ్ యూనిట్ నుంచి బాగా విస్తరించింది. స్టెరైల్ పరికరాలను సరఫరా చేయడంలో అంకితభావంతో కూడిన పనితీరు ఉండేలా ఈ విభాగం జాగ్రత్త వహిస్తుంది. తద్వారా ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చూడటంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది్ణ్ణ అని చెప్పారు.
అవార్డు అందుకున్న బృందంలో, కిశోర్ రెడ్డి (మేనేజింగ్ డైరెక్టర్), డాక్టర్ రవిశంకర్ (క్వాలిటీ, పేషెంట్ సేఫ్టీ విభాగాధిపతి), ఇమ్రాన్ (క్వాలిటీ మేనేజర్), రామాంజనేయులు (సీఎస్ఎస్‌డీ ఇన్‌ఛార్జి) ఉన్నారు.