విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పరిసర ప్రాంతాలలో విద్యారంగానికి కొత్త అధ్యాయన్ని నెలకొల్పుతూ శుక్రవారం కియా ఇండియా వారు పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సి ఎస్ ఆర్ ప్రోగ్రాం కింద లైబ్రరీ బ్లాక్ ను నిర్మించడం జరిగింది. ఆ బ్లాకును ప్రారంభించిన అనంతరం విద్య కోసం కియా ఇండియా ఖర్చు చేసినందుకు ఆనందంగా ఉందని కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ,పలువురు కియా ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుతున్న,పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, కొత్తచెరువు, మండలాల్లోని 83 గ్రామాలకు చెందిన విద్యార్థులకు ఈ సదుపాయం లెర్నింగ్ హబ్‌గా మారనుందని తెలిపారు.కియా లైబ్రరీ బ్లాక్,అనేక కార్యక్రమాల ద్వారా పొరుగు ప్రాంతాలను విద్య పరంగా మెరుగుపరచడంలో మా అంకితభావానికి నిదర్శనం అన్నారు. మేము సమాజంలోని అన్ని విధాలుగా సహాయం చేయడానికి మా సి ఎస్ ఆర్ కార్యకలాపాలను కొనసాగిస్తామని తెలిపారు.ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో కియా లైబ్రరీ బ్లాక్ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులు మరింతగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.