Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కురుబలు అన్ని రంగాల్లో రాణించాలి

విశాలాంధ్ర`బొమ్మనహాళ్‌: కురుబలు రాజకీయంగా ఆర్థికంగా బలపడాలంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించుకున్నప్పుడే రాజకీయంగా ఆర్థికంగా బలపడి కురుబలు అన్ని రంగాల్లో రాణించాలని కురుబ సంఘ నాయకులు అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందవాడ గ్రామంలో కురుబ సోదరులు ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్త కనకదాసు చిత్రపటాన్ని ట్రాక్టర్‌ లో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డబ్బు వాయిద్యాలతో పూల వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కురుబ సోదరులు ఐక్యమత్యంతో ఉంటూ రాజకీయంగా ఎదగాలని మండల కురుబ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img