Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

కేంద్ర బడ్జెట్ పై సిపిఎం నిరసన

విశాలాంధ్ర-ఉరవకొండ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అదాని అవినీతికి వ్యతిరేకంగా ఉరవకొండలో శుక్రవారం సిపిఎం పార్టీ స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ కోతలు విధించిందని ఎరువులపై సబ్సిడీలు తగ్గించి, ధరలు పెంచిందని పేర్కొన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలు, ఎరువులు అందక రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు అప్పులు రెట్టింపై ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయన్నారు. కౌలు రైతులను కనీసం గుర్తించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్‌లో భారీగా కోతలు పెట్టడం అంటే పేదల కడుపు కొట్టడం తప్ప మరోటి కాదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను ఎత్తివేయడానికి తోడు బడ్జెట్‌లో సంక్షేమ నిధులను భారీగా తగ్గించేశారని తెలిపారు. ప్రజా పంపిణీ ద్వారా సరఫరా అయ్యే సబ్సిడీ బియ్యాన్ని రద్దు చేశారన్నారు. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న జనానికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డటుగా ఈ బడ్జెట్‌ భారాలు కోలుకోలేని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరణ పోలవరానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మధుసూదన్ నాయుడు, రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, సీనప్ప పార్టీ మరియు రైతు సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img