Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

కేసులకు బయపడేది లేదు

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

విశాలాంద్ర , కళ్యాణదుర్గం..శెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామ వాలంటీర్ పింఛన్ ఇవ్వలేదని ఒక దళిత యువకుడు ప్రశ్నిస్తే అతన్ని నోటీసులవకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, అరెస్టు చేయడం అమానుషమని దీన్ని ప్రశ్నించడానికి తాము వెళితే తమపై కూడా అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరాయ చౌదరి మండిపడ్డారు . తన కుమారుడు డాక్టర్ ఉన్నశీ మారుతి చౌదరి తో కలిసి ఆయన కళ్యాణదుర్గంలో సోమవారం మీడియా తో మాట్లాడారు. రెండు రోజుల కిందట శెట్టూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టామని గుర్తు చేశారు. ఆ సందర్భంలో వాలంటీర్ వ్యవహారంపై మాట్లాడుతూ మంత్రి ఉషాశ్రీ చరన్ భర్త చరణ్ రెడ్డివ్ కంకర మిషన్ యజమాని ని బెదిరించి 50 శాతం షేర్ రాయించుకున్నాడని తాను ఆరోపించామని దీనిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఐపీసీ 18/22, 353, 141, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఇలాంటి కేసులపై తమ బెదిరేది లేదని హెచ్చరించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ నాన్ లోకల్ అని తాము పక్కా లోకల్ అని సమస్యలపై స్పందించకుండా బెదిరింపు ధోరణిలో వెళ్తున్న మంత్రి పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సెట్టూరు మండల మాజీ కన్వీనర్ తిప్పారెడ్డి, కళ్యాణదుర్గం మాజీ జెడ్పిటిసి కొల్లాపురప్ప, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, మాజీ ఎంపిటిసి రామాంజనేయులు , గరికపాటి హరికృష్ణ, గడ్డం రామాంజనేయులు, సాయినాథ్ , దాసరి గోపి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img