విశాలాంధ్ర ..పెనుకొండ..భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులు భవనములో సీనియర్ సివిల్ జడ్జి .శంకర్ రావు , జూనియర్ సివిల్ జడ్జి, ముజిబ్ పసల సయ్యద్ , ఆధ్వర్యంలో శుక్రవారం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేకు కట్ చేసి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే అంబేడ్కర్ సేవలు కొనియాడారు ఆయన భారత దేశానికి చేసిన సేవలు రాజ్యాంగ నిర్మాతగా ఆయన దేశ దేశాలు తిరిగి మన దేశానికి కావలసిన అవసరమైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తిగా మేధావిగా ఆయన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శంకర్ రావు , జూనియర్ సివిల్ జడ్జి ,ముజీబ్ పసల సైయ్యాద్ , బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు , ఏ జి పి భాస్కర్ రెడ్డి, శివ శర్మ, నాగిరెడ్డి, ఆసిఫ్, మోహన్ నాయక్, శ్రీనివాస్, ఇతర బార్ సభ్యులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.