Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

క్రియాశీలక సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర.. ధర్మవరం : జనసేన పార్టీలో మూడవ విడత కింద క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వం చేసుకోవడం వలన ఐదు లక్షల వరకు జీవిత బీమా సౌకర్యము, 50 వేల రూపాయల మెడికల్ ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సదుపాయం వల్ల ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త కుటుంబానికి భరోసాంగా ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో సభ్యత్వం నమోదు చేసుకున్న వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img