అంతర్జాతీయ క్షమ వ్యాధి దినోత్సవం
డాక్టర్. సువర్ణ లక్ష్మి
కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : వాడుక భాషలో టీబీగా పిలిచే క్షయ వ్యాధి (ట్యుబర్ కులోసిస్) వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 13 లక్షల మంది మరణిస్తున్నారు. అందులో 26శాతం మంది భారతదేశానికి చెందినవారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 3 మంది టీబీ కారణంగా మరణిస్తున్నారు. అందులో మూడవ వంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. క్షయవ్యాధి అనేది బ్యాక్టీరీయా వల్ల వస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. కానీ మెదడు, మూత్రపిండాలు మరియు వెన్నుముక వంటి శరీరంలో ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి గాలి బిందువులు ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల టీబీ వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గు లేదా ఉమ్మి చేసినప్పుడు వారు టీబీ బ్యాక్టీరియా సుక్ష్మ క్రిములను గాలిలోకి విడుదల చేస్తారు. ఒక వ్యక్తి ఈ క్రిములను కలిగి ఉన్న చుక్కల కేంద్రాలను పీల్చినప్పుడు వ్యాధి ప్రబలడం జరుగుతుంది. ఈ వ్యాధి వంటగది పాత్రలను పంచుకోవడం ద్వారా లేదా ఎవరినైనా ముద్దుపెట్టునప్పుడు లాలాజలంతో సంబంధం కలిగి ఉందడు.
పోషకాహార లోపం, మధుమేహం, క్యాన్సర్ రోగులు, హెచ్ఐవి, పోగాకు వాడే వ్యక్తులు వంటి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, ఈ క్షయ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. జైళ్లు, నిరాశ్రయులైన ఆశ్రమాలు, మానసిక ఆస్రపత్రుల్లో నివసించే లేదా పనిచేసే వ్యక్తులు సరైన వెలుతురు లేని కారణంగా కూడా వ్యాధికి గురువుతారు.
దగ్గు (కఫంతో, రక్తంతో), ఆయాసంచ ఛాతిలో నొప్పి, జ్వరం, రాత్రి చెమటలు, ఎక్కువగా బరువుతగ్గటం, బలహీనత, ఆకలి తగ్గడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఛాతి ఎక్స్ రే, కఫం పరీక్షలు చేసి ఈ వ్యాధి సోకిందా లేదా అని నిర్థారణ చేయవచ్చు. ఈ వ్యాధి పూర్తిగా నయం చేయదగినది మరియు నివారించదగినది. మందులు సంక్రమణకు పూర్తిగా చికిత్స చేస్తాయి.
వివిధ జీవనశైలి మార్పులు సహాయపడుతాయి.
సమయానికి మందులు తీసుకోవడం
చికిత్స యొక్క పూర్తి కోర్సును పూర్తి చేయడం
ఆరోగ్యకరమైన ఆహారం, ప్రోటిన్ విటమిన్-సి, ఈ కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం
విశ్రాంతి మరియు తగినంత నిద్రపోవడం
ధూమపానం, మద్యపానంకి దూరంగా ఉండడం సానకూలంగా ఉండడం, రోటిన్ చెక్ ఆప్ షెడ్యూల్ చేసుకోవడం కూడా వ్యాధి నిర్వహణలో సహాయపడుతాయి.
క్షయ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దగ్గుతున్నప్పుడు మీ నోటికి రమాలు అడ్డుపెట్టుకోవాలి
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు
మంచి మాస్కులు ధరించాలి
క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
మద్యం, పోగాకు పదార్థాలు తీసుకోవద్దు
వెంటిలేషన్ ఉన్న గదిలో ఉండాలి
ఈ వ్యాధి సోకిన మొదటి కొన్ని వారాల్లోనే వేగంగా విస్తరిస్తుంది. కావున ఆ సమయంలో రోగితో కలిసి ఉండడం లేదా నిద్రించండం చేయకూడదు.
ప్రజల్లో ఉన్న అపనమ్మకాలు
టీబీ నయం చేయలేని వ్యాధి, చికిత్సకు మందులు రోగికి హాని చేయవచ్చు. టీవీ వంశపారపర్యంగా వస్తుంది. అసురక్షితమైన లైంగిక పద్దతుల ద్వారా వ్యాపిస్తుంది. హ్యాండ్ షేకింగ్, మొదలైనవి రోగి వారి పరిస్థితిని రహస్యంగా ఉంచడానికి కారణమవుతాయి. వైద్యుల సలహా మేరకు (ఊపిరితిత్తుల వైద్య నిపుణులు)లకు క్రమం తప్పకుండా టీబీ మందులను తీసుకుంటూ వివిధ జీవినశైలి మార్పులతో టీబీ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు మరియు నివారించవచ్చు.