విశాలాంధ్ర`ధర్మవరం : క్షయ ఎలిమినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ తిప్పయ్య జిల్లా పిపిఎం కోఆర్డినేటర్ నాగమణిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ పురములో క్షయ ఎలిమినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎంసి సర్వే ఇంటింటా వెళ్లి సమాచారాన్ని సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సర్వే 14 రోజులు పాటు నిర్వహిస్తామని ఈ సర్వేలో టీబీ లక్షణాలు గల వారిని గుర్తించి,వారి నుండి గళ్ళను సేకరించి, పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్ష ఫలితాలలో టీబీ వ్యాధి నిర్ధారణ అయితే వారికి ఆరు నెలల కాలం పాటు టీవీ మాత్రలు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం టీబి వ్యాధి నుండి నివారణ వివరాలను కూడా తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిబి యూనిట్ సూపర్వైజర్ రహమత్ బాషా, వాలంటీర్లు దుర్గాప్రసాద్, శ్రీకాంత్,ఆశా వర్కర్ లక్ష్మీకాంతమ్మ, సూపర్వైజర్ కృష్ణప్ప పాల్గొన్నారు.