Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తాం..

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ కె. వెంకటరావు.
విశాలాంధ్ర -ధర్మవరం :
ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తామని పట్టణంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్.. కే. వెంకటరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు బ్యాంకు సేవలో అందిస్తున్న వివిధ సేవలను తెలియజేశారు. పట్టణంలోని అన్ని బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీని డిపాజిట్ రూపంలో ఇస్తున్నామని, జనరల్ గా ఉన్నవారికి 7.25 శాతం, మహిళలకు 7.3 శాతం, సీనియర్ సిటిజన్ పురుషులకు 7.75 శాతం, సీనియర్ సిటిజన్ స్త్రీలకు 7.8 శాతం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా బ్యాంకు ఖాతాను తెరిచే అవకాశం ఉందని, నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ ద్వారా కూడా అనుసంధానం చేసే సదుపాయం కూడా కలదు అని తెలిపారు. బ్యాంకు నందు లాకర్ సౌకర్యం కూడా కలదని, నూతనంగా అకౌంటు ఓపెన్ చేసుకోవడానికి రూ.1000 చేసే అవకాశం ఉందని, తదుపరి ఏటీఎం కార్డు సదుపాయం కూడా కలగ చేస్తామని తెలిపారు. మా బ్యాంకులో ఖాతా లేకున్నా డిపాజిట్ చేసేవారికి అప్పటికప్పుడే ఖాతా ప్రారంభించి, డిపాజిట్ ను చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి సదవకాశాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img