Friday, June 9, 2023
Friday, June 9, 2023

గడపగడపకు సంక్షేమ లబ్ది పథకాలు అమలు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ 08, 09 వ వార్డు పరిధిలో గల ఉప్పరవాడ మరియు దర్గా పేటలో మంగళవారం శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ ఇతర నాయకులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ప్రతి గడపగడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాలను వివరిస్తూ ఇంకా అర్హులైన సంక్షేమ పథకాలు అందని వారికి తెలియజేయాలని కోరుతూ సంక్షేమ సారధిని జీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారుఏ ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే శంకర నారాయణ కి ఆత్మీయ స్వాగతం పలుకుతూ, జగనన్న ప్రభుత్వంలో మేము లబ్ధి పొందుతున్నామని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు వస్తున్నాయని, జగనన్న పాలన పట్ల సంతోషాన్ని ఆ కాలనీ ప్రజలు వ్యక్తం చేశారు.
అలాగే ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందని వారికి ఎందుకు రాలేదని వివరిస్తూ, ప్రజల వ్యక్తిగత సమస్యలను సైతం తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అక్కడే అధికారుల సమక్షంలో పరిష్కారం చూపారు ఈ కార్యక్రమంలో , మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్ లు, టౌన్ కన్వీనర్, మండల కన్వీనర్, ఎంపీడీఓ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు , సర్పంచులు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img