Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

గద్వాల జమ్ములమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం…

విశాలాంధ్ర-గుంతకల్లు : సంచార జాతుల ఆరాధ్యదైవం శ్రీ గద్వాల జమ్ములమ్మ తల్లి, గద్దిరాల మారెమ్మ తల్లి దేవాలయ నిర్మాణం శుక్రవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్టు రుద్రాక్షల కుళ్లాయప్ప, సంచార జాతుల మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రుద్రాక్షల ఇందిర దేవి దంపతుల ఆద్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా కుల్లాయప్ప మాట్లాడుతూ మండలంలో అందరూ కలిసి గద్వాల జమ్ములమ్మతల్లి,గద్దిరాల మారెమ్మ తల్లి ఆలయం నిర్మించుకోవడం శుభసూచకమని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు.దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆ గద్వాల జమ్ములమ్మ తల్లి, గద్దిరాల మారెమ్మ దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం పసిడిపంటల తోటి వర్ధిల్లాలని అన్నారు. ఆ గద్వాల జమ్ములమ్మ తల్లి , గద్దిరాల మారెమ్మ తల్లి కృపతో పాడి పశువులు సిరి సంపదలతో ప్రజలందరూ జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం సంచార జాతుల సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా డోలు ముగిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img