ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర= ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి మే నెల 7వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ వైస్ చైర్మన్ కుండా చౌడయ్య,ఆలయ డైరెక్టర్లు, దాతలు, భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారు ఉదయం గరుడ వాహనం, మధ్యాహ్నం శేష వాహనం సాయంత్రం గజవాహనం లలో పట్టణ పురవీధులలో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, గుణ శేఖర్ స్వామి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలైన దక్షిణామూర్తి అండ్ బ్రదర్స్, పద్మ నాగమోహన్, చెంచయ్య ,అంబారపు వెంకటేశులు సన్స్, కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, రూప రాజా కృష్ణ, పిన్ను సత్యనారాయణ శ్రేష్ఠి అండ్ సన్స్, సుదర్శన్, కలవల రామ్ కుమార్, డివి. వెంకటేశులు (చిట్టి) రామేశ్వర శర్మ, కుంటిమల వెంకటస్వామి, బలుస వెంకట సుబ్బారావు, గడ్డం సాయినాథ్, గడ్డం శ్రీనివాసులు, యంబా పెద్దన్న అండ్ సన్స్, కుండా మీనాక్షి య్య, కృష్ణమూర్తి, శ్రీనివాస్, జింక రామాంజనేయులు, లీలావతి, కలవల బద్రీనాథ్ నారాయణ అండ్ సన్స్, వెంకటేష్ అండ్ సన్స్, శ్యామ్ రావు, లక్ష్మీ చెన్నకేశవ, కాలంగి శ్రీనివాసులు అండ్ సన్స్, కాలంగి గోవర్ధన్ అండ్ సన్స్, పేరిటన అర్చనతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా స్వామివారి ఎదుట ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కరించారు. స్వామివారి అలంకరణ, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం గానం చేసిన సంకీర్తనలు, భజనలు భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవ వేడుకలు మే 7వతేదీ తో ముగుస్తాయన్నారు. ఈ వేడుకలు కమిటీ, దాతల సహాయ సహకారములతో నిర్వహించబడుతోందని తెలిపారు. తదుపరి సాయంత్రము స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో భక్తాదులు, దాతల నడుమ అర్చకులు నిర్వహించారు. ఉభయ దాతలుగా గజనాన్య పట్టు సాలే సంఘం వారు వ్యవహరించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జగ్గా జయలక్ష్మి, పోరాల్ల పద్మావతి, సత్రశాల సత్యనారాయణ, సౌందర్య లహరి సునీత, గిర్రాజు మహాలక్ష్మి, అన్నమయ్య సేవా మండలి పోరాల్ల పుల్లయ్య, వారి శిష్య బృందం, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.