Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

గర్భిణీ స్త్రీకి రక్తదానం

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం జరుట్ల రామపురం గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ పరీక్షించిన డాక్టర్లు తక్షణమే ఏ నెగటివ్ రక్తం ఎక్కించాలని కుటుంబ సభ్యులుకు తెలియజేశారు. వారు వెంటనే ఆపద్బాంధవ స్వచ్ఛంద సంస్థ సభ్యులను సంప్రదించగా స్పందించిన ట్రస్ట్ నిర్వాహకులు తమ ట్రస్ట్ సభ్యులు అయిన విజయ్ కుమార్ ను బుధవారం రక్త నిధి కేంద్రానికి పంపించి రక్తం దానం చేయించారు. సకాలంలో రక్తం దానం చేసిన సభ్యులకి ఆపద్బాంధ ట్రస్ట్ నిర్వాహకులకు, గర్భిణీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img