Monday, June 5, 2023
Monday, June 5, 2023

గాడ్ ఫాదర్ మోడీ కి దత్తపుత్రుడు జగన్ దాసోం…

ఐదు కోట్ల మంది ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం….

80 లక్షలు ఈవీఎంలు కొంటే 20 లక్షలు ఈవీఎంలు మాయం…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్…

విశాలాంధ్ర గుంతకల్లు : ప్రచార బేరి ఏప్రిల్ 14 నుండి 30 తారీఖు వరకు మోడీ హటావో దేశ్ కి బచావో కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో శనివారం బీరప్ప గుడి సర్కిల్ హమాలి కార్యాలయం వద్ద నుండి బైక్ ర్యాలీ ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా డి. జగదీష్ మాట్లాడుతూ…నరేంద్ర మోడీకి జగన్ దత్తపుత్రుడు మాదిరి వ్యవహరిస్తున్నాడని ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర మైన అన్యాయం చేస్తున్న జగన్ ప్రభుత్వం జగన్ మాత్రం మోడీకి దాసోహం అంటున్నారని విమర్శించారు.నరేంధ్ర మోడి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని, రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారని అయినా ఇప్పటికీ 31 మంది ఎంపీలు పార్లమెంటు సభలో ఒక్కరోజు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని అయినా జగన్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.అయితే జగన్ లాలూచీ పడినాడని అన్నారు.ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఒక్కరు కూడా లేరని అన్నారు. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడని తెలిపారు.బిజెపి అండ ఉంటే మళ్లీ నేను అధికారంలోకి వస్తానని అనే ధీమాతో జగన్ వైయస్సార్ పార్టీ ఉందన్నారు. ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న మోడీ పైన నమ్మకం పెట్టుకున్నాడని అన్నారు. మోడీనే ఈ ఈవీఎం లా తో గెలిచాలని, ఈవీఎంల ట్యాంపరింగ్ ల ద్వారా గెలిచేందుకు ఈవీఎంలు కోసం దత్తపుత్రుడు అనిపించుకుంటున్నాడని అన్నారు. ఈవీఎంలు నరేంద్ర మోడీ ద్వారా కాపాడతాయని తెలిపారు.అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడడం లేదని కేవలం మన ఇండియాలోనే మోడీ వాడుతున్నారని అన్నారు.ముందస్తు ఎన్నికలు పెడతామని మళ్లీ మార్చుకొని సార్వత్రిక ఎన్నికలు చేపట్టాలని అనుకుంటున్నారు. ఇండియాలో 80 లక్షల ఈవీఎం లు కొన్నారు. అయితే 60 లక్షల ఈవీయంలు ఉన్నాయని మిగతా 20 లక్షలు మాయమైనాయని అన్నారు.ఎలక్షన్ కమిషనర్ ఎందుకు బ్యాలెట్ పెట్టడం లేదని ప్రశ్నించారు. వాల్ల గాడ్ ఫాదర్ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ,జగన్ సూట్కేసుల కంపెనీలు పెట్టె నైపుణ్యం గల యిద్దరు ఒక టేన ని ఏధేవా
చేశారు.ఆయనకి ,ఈయనకి సిబిఐ ,సిఐడి అధికారులను ఉపయోగించుకొని అక్కడేమో నరేంద్ర మోడీ ప్రశ్నించే వారిపై పై కేసులు నమోదు చేస్తూ సి బి ఐ ని వాడుకుంటున్నారని అన్నారు.ఇక్కడేమో సిఐడి ని ఉపయోగించుకుని రామోజీ రావు పైన కేసులు పెడుతున్నారని అన్నారు. మార్గదర్శిని అనేది జగన్ పుట్టుక ముందే ఉండేదని అన్నారు.సిఐడి రామోజీరావుని వేధించడం వల్ల హాస్పటల్ లో బెడ్డు పైన చికిత్స పొందుతున్న ఆయనను ఆ ఫోటో సాక్షి పేపర్లో వస్తుందని ఇంతటి కక్ష పూనుకుందని అన్నారు. అందుకనే అక్కడ మోడీ ఇక్కడ జగన్ గాడ్ ఫాదర్ దత్తపుత్రుడు కలిసి ప్రజలను తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రచార బేరి బైక్ ర్యాలీలో సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సిపిఐ మండల పట్టణ సహాయ కార్యదర్శి లు ఎస్ ఎండి గౌస్ ,రామాంజనేయులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య ,ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ ,డిహెచ్ పేస్ నాయకులు మల్లయ్య, సిపిఐ నాయకులు గురు స్వామి, రామాంజనేయులు, నాగేంద్ర, దౌలా, సూరిబాబు,గడ్డం బాషా,పాత గుంతకల్,మిల్ హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img