Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

గృహ నిర్మాణ లబ్ధిదారులకు న్యాయం చేయాలని మార్చి 2 న చలో విజయవాడ

విశాలాంధ్ర- ఉరవకొండ : గృహ నిర్మాణ లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ మార్చి 2న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి తెలిపారు. మంగళవారం ఉరవకొండ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకంలో భాగంగా జగనన్న కాలనీలో లబ్ధిదారులకు నిర్మిస్తున్న ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోవడం లేదని దానిని 5 లక్షల రూపాయలకు పెంచాలని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని టీడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని తదితర అనేక సమస్యలను పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు చలో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ తాలూకా సిపిఐ పార్టీ కార్యదర్శి మల్లికార్జున సహాయ కార్యదర్శి మనోహర్, పార్టీ నాయకులు చెన్నా రాయుడు, తలారి మల్లికార్జున సుల్తాన్, రమేష్, పార్వతీ ప్రసాద్ ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img