Friday, March 31, 2023
Friday, March 31, 2023

గోల్డ్ మెడల్ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర- శెట్టూరు : మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు పేరు పొందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు 35 వ సబ్ జూనియర్ టెన్నికాయిట్ జాతీయ స్టాయి పోటీలలో మన ఆంధ్ర ప్రదేశ్ తరుపున శెట్టూరు మండల కనుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అమృత 9వ తరగతి చదువుతున్న సుప్రియ మన రాష్ట్రంలో పలస లో జరిగిన పోటీల్లో తమిళనాడు జట్టపై గెలుపొంది మన రాష్ట్రం తరఫున బంగారు పతకం సాధించారని గ్రూప్ విభాగం లొ కుడా వీరితో పాటు పాల్గొన్న రజని కాంస్యం సాధించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిరోజ్ ఖాన్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అమరాంజనేయులు తెలియజేశారు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్కూల్ కమిటీ చైర్మన్ క్రిష్టప్ప గ్రామ ప్రజలు తల్లిదండ్రులు వారికి అభినందనలు తెలియజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img