Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

గ్యాస్‌ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడం అభినందనీయం..

జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌
విశాలాంధ్ర-ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లాలో గల ధర్మవరం లక్ష్మి హెచ్‌.పీ గ్యాస్‌ ఏజెన్సీ దారులైన గోవింద చౌదరి వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించి, పట్టణ ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పుట్టపర్తిలో గ్యాస్‌ ఏజెన్సీ దారులైన గోవింద చౌదరి అల్లుడైన అనంతకు అభినందన ప్రశంసా పత్రము అవార్డును అందజేశారు. అనంతరం గోవింద చౌదరి మాట్లాడుతూ గ్యాస్‌ వినియోగదారులకు మరిన్ని సేవలను మున్ముందు కూడా అందిస్తానని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి గ్యాస్‌ కార్యాలయ సిబ్బంది కూడా గోవింద చౌదరికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img