Friday, June 2, 2023
Friday, June 2, 2023

గ్రామ అభివృద్ధికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కృషి

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మహాత్మ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు   ఉరవకొండ మండలం బూదగవి  అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గ్రామాన్ని దత్తుపత్తి తీసుకొని  వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.స్వచ్ఛభారత్, కోవిడ్ జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, చెట్లు నాటే కార్యక్రమాలతో పాటు స్వచ్ఛభారత్  తదితర అనేక అంశాలపై   ప్రజలకు అవగాహనకల్పిస్తున్నారు. మంగళవారం గ్రామంలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బసవరాజు, ఏవో కేకే ప్రసాద్, కరస్పాండెంట్ షాజహాన్,ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఇషాక్  అహ్మద్, సత్యనారాయణ కళాశాల సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img