విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను ఎన్ ఐ ఎస్ జూడో కోచ్ ఇనాయత్ భాషా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఆర్డిటి జూడో క్లబ్ ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉషోదయ హై స్కూల్ కరెస్పాండెంట్ చాంద్ బాషా విచ్చేసి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై తగు సూచనలను ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మనకు ప్రాణ శక్తిని అందించేటువంటి చెట్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ప్రతి ఇంటా ఒక చెట్టును నాటగలిగినప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామని తెలిపారు. మొక్కను నాటడం సులభమని, దానిని పరిరక్షించుటను బాధ్యతగా తీసుకున్నప్పుడే, అనుకున్న ఫలితం లభిస్తుందన్నారు. తదుపరి చాంద్ బాషా చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న జూడో క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.