Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ, ఆలయ యజమానులు, శివదీక్ష మాలధారణ కమిటీ, కల్యాణోత్సవ ఉభయ దాతలు, పట్టణ యావన్మంది భక్తాదుల ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ద్వారకనాథ్ శర్మ మాట్లాడుతూ ప్రత్యేక పూజలతో పాటు గణపతి పూజ, రుద్రాభిషేకం, ప్రత్యేక అలంకరణ, ఎదుర్కొల్లు ,మాంగల్య ధారణ ,పునః పూజ లాంటి కార్యక్రమాలను వేదమంత్రాలతో,మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించడం జరిగిందన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కళ్యాణ మహోత్సవము నిర్వహించుటలో భక్తాదుల సహాయ సహకారాలు కూడా అందడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నసంతర్పణ కార్యక్రమానికి కూడా భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి గురువారం సాయంత్రం గ్రామోత్సవం కార్యక్రమం కూడా ఉంటుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img