Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఘనంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం ఉత్సవ వేడుకలు


విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు ముగిసిన తర్వాత సోమవారం రాత్రి 11 గంటలకు ఆలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల నడుమ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవ ఉభయ దాతలుగా దాశెట్టి పద్మావతి దాశెట్టి సుబ్రహ్మణ్యం లు వ్యవహరించారు. ఈ కళ్యాణ వేడుక కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాల నడుమ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశులు చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య ,సభ్యులు జగ్గా జయలక్ష్మి, సరస సౌందర్యల హరి, గిర్రాజు మహాలక్ష్మి, సత్రశాల సత్యనారాయణ, పురాళ్ల పద్మావతి, దాడి తోట సునీతతో పాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img