Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి

విశాలాంధ్ర.. ఉరవకొండ..భారత దేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జివన్ రావు 115వ జయంతి వేడుకలను బుధవారం ఉరవకొండ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ సిఐ.హరినాథ్, ఎం. ఆర్. పి. ఎస్. అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కౌకుంట్ల రవి, ఉరవకొండ తాలూకా అధ్యక్షులు రాంపురం చిన్నప్ప హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ తాలూకా గౌరవాధ్యక్షులు ఎం. గంగాధర్, జిల్లా నాయకులు ఎం ఓబన్న, తాలూకా నాయకులు వెంకటేశులు, నియోజకవర్గ అధ్యక్షులు ఎం. రామాంజనేయులు, ఉపాధ్యాయులు ఏ. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img