Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

చంద్రబాబు జన్మదినానికి 2000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీలో గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేసే ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారుఅనంతరం ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలైన 2000 ముస్లిం కుటుంబాలకు 10 రకాల వస్తువుల తో కూడిన రంజాన్ తోపాను అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ.అనంతరం సవితమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా అందించేవారని వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ కులాలకు ఇచ్చే కానుకలను రద్దు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబ సభ్యులు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశం తో ఈ తోఫాను పెనుకొండ పట్టణ ముస్లింలకు గత నాలుగు సంవత్సరాలుగా అందచేస్తున్నామని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2000 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ని అందచేయడం చాలా సంతోషంగా ఉందని రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని దీవించాలని తెలియజేసిన సవితమ్మ ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ముస్లిం లు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img