విశాలాంధ్ర- పెనుకొండ :పెనుకొండ నియోజకవర్గం నందు సవితమ్మ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ నందు గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని సవితమ్మ ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేశారు అందరికీ మంచి రుచికరమైన భోజనాన్ని వడ్డించి తిన్న వారంతా చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని త్వరలో ముఖ్యమంత్రి కావాలని ఆశీస్సులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, గోరంట్ల మండలశీ గుమ్మయ్యాగారి పల్లి అశోక్, హరి, గంగంపల్లి లక్ష్మీనారాయణ, ఐ టి డి పి మంజునాథ్, వెంకటేష్, శివ నాయక్, వాసుదేవ రెడ్డి, బాబుల్ రెడ్డి , షమీ, సూర్యనారాయణ, ప్రసాద్, త్రివేంద్ర, తదితరులు పాల్గొన్నారు.