Monday, March 20, 2023
Monday, March 20, 2023

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం చాలా దారుణం,

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది

విశాలాంధ్ర- పెనుకొండ : పట్టణములోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో సభకు అనుమతి తీసుకున్నాక కూడా అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయని
రక్షణ కల్పించాల్సిన పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు లేదాచంద్రబాబునాయుడుకి ,నారా లోకేష్ పాదయాత్ర కు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ భయపడిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ తీరు అమానుషం దిగజారడమే , రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగశీ అమలు చేయాలనుకోవడం సిగ్గుచేటు. వైసీపీ ప్రభుత్వం ప్రజా తిరుగుబాటుకు బలికాక తప్పదు. ప్రజలందరూ ఈ బటన్ రెడ్డి ముఖ్యమంత్రి కి అతి తొందర్లోనే బుద్ధి చెప్తారు తెలుగుదేశం పార్టీకి ప్రజలలో స్పందన చూసి జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతూ ప్రతిపక్ష నాయకులపై తీవ్ర నిర్బంధాలు చేస్తున్నారు ఏన్ని నిర్బంధాలు చేసిన ప్రజలే పార్టీని నాయకులనుకాపాడుకుంటారనే విషయం జగన్ రెడ్డికి తెలియక పోలీసుల చేత అడగడనున ఆటంకాలు సృష్టిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ప్రభంజనం చాప కింద నీరుల పూర్వ వైభవం తెచ్చుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారని ముఖ్యంగా యువత నిరుద్యోగ యువత వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారని
ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, గుట్టురు మాజీ సర్పంచ్ లు సూర్యనారాయణ, గయప్ప, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు ,త్రివేంద్ర , దాదు మంజు ,నాగార్జున, మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img