ఐసిడిఎస్ పిడి నాగమల్లేశ్వరి
విశాలాంధ్ర – ధర్మవరం : కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చట్టంపై తప్పనిసరిగా అవగాహన పెల్చుకున్నప్పుడే తగిన న్యాయం జరుగుతుందని ఐసిడిఎస్ పీడీ నాగమల్లేశ్వరి, ముఖ్య అతిధి రుక్య బేగం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పలు చట్టాలపై వారు అవగాహన కల్పిస్తూ, పలు వివరాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ లీగల్ లెక్సిరేషన్, పోష్మో యాక్ట్, డివియాక్ట్, ఫోక్ షో యాక్ట్, లను తెలియజేశారు. అనంతరం విద్యార్థినీలతో నేరుగా మాట్లాడుతూ వారికి ఉన్న పది సమస్యలను వినడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆ సమస్యలకు కూడా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినిలు అందరూ కూడా చదువు లో తగిన ప్రతిభ కనపరిస్తే చక్కటి బహుమతులు కూడా లభిస్తాయని, ఆ బహుమతులు చదువులో ప్రోత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. విద్యార్థినిలు అందరూ కూడా ధైర్యంగా ఉంటూ జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొనే విధంగా ఉండాలని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఓఎస్సీ పొందే అవకాశం ఉంది అని వారి వివరించారు. ఆడపిల్లల మీద దాడులు అఘాయిత్యం గురించి వివరిస్తూ, వాటిని ఎదుర్కొనే మార్గాలను కూడా సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్ కమిషనర్ ఝాన్సీ, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బాల స్వామి, పారామెడికల్ సిబ్బంది రమా జ్యోతి, కౌన్సిలర్ కరిష్మా పాల్గొన్నారు.