Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

చదువుతోపాటు చిత్రలేఖనంలో కూడా అభ్యసన ఎంతో అవసరం : హెడ్మాస్టర్‌ కాంతమ్మ

విశాలాంధ్ర`ధర్మవరం : చదువుతోపాటు ప్రతి విద్యార్థి చిత్రలేఖనంలో కూడా అభ్యసన ఎంతో అవసరమని హెడ్మాస్టర్‌ కాంతమ్మ, తెలుగు పండిట్‌ ఆదినారాయణ, టీచర్లు కమల, సుశీల దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణములోని బాబు జగ్జీవన్‌ రామ్‌ నగర్‌ లో గల, ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ‘‘55 వ గ్రంథాలయ వారోత్సవాలలో’’ భాగంగా 5వ రోజు ‘‘చిత్రలేఖనం పోటీలు-పర్యావరణ పరిరక్షణ’’ అన్న అంశంపై గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ ఈ చిత్రలేఖనం పోటీలకు ఆరు పాఠశాలలు లో 150 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని, వారిలో గల సృజనాత్మకత కళ్ల ను వెలికి తీశారని తెలిపారు. ఈ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది గంగాధర్‌, రమణ నాయక్‌, శివమ్మ, పాఠకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img