Monday, June 5, 2023
Monday, June 5, 2023

చలివేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణంలో శుక్రవారం నాడు అంబేద్కర్ సర్కిల్లో అబ్దుల్ కలామ్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్రం పెనుకొండ డి.ఎస్.పి హుస్సేన్ పీరా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఐ కరుణాకర్ ఎస్సై రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఎంతోమంది ప్రయాణికులకు, విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలకు, పనుల కోసం వచ్చి పోయే వారికి నీటి కొరత లేకుండా చేయడం, ఆసుపత్రికి వచ్చి వెళ్లేవారికి చలి వేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొచ్చిన అబ్దుల్ కలామ్ కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ .శ్రీనివాసులు, అఫిషియల్ క్లబ్ సెక్రటరీ సమీవుల్లా, . రవూఫ్, కురుబ నంజుండ, . జాఫర్ వలి, పాన్ బాషా, రామాంజినేయులు, నరసింహులు, పెద్దన్న కడియాల సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img