Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు వితరణ

విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని రోటరీ క్లబ్ కార్యా లయం వద్ద బుధవారము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు పాల్ హారిస్ జన్మదిన వేడుకలు నిర్వ హించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు షాకీర్ భాష మాట్లాడుతూ రోటరీ క్లబ్ వ్యవస్థాపకుడు పాల్ హరీస్ జన్మదిన సందర్భంగా 3 మహిళలకు 40వేలు విలువ చేసే 2 పెద్ద, 1చిన్న తోపుడు బండ్లు అందించామన్నారు. అలాగే పట్టణ రోటరీ క్లబ్ ఇంట రాక్ట్ క్లబ్ అధ్యక్షునిగా ఉమర్ షాద్ కార్యదర్శిగా రోషన్ లకు నియామక పత్రము సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు సంజన్న చేతుల మీదుగా అందించినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు షాకీర్ భాష చెప్పారు. అనంతరం ఇంటర్నెట్ క్లబ్ అధ్యక్షుడు ఉమర్షాద్ ముగ్గురు మహిళలకు నిత్యా వసర సరుకులు అందించారు. ఈ కార్య క్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కిషోర్, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఉమా మహేశ్వరి, కౌసర్ సభ్యులు సంజన్న, బాలసుబ్రమణ్యం, మద్దిలేటి, అనిల్, రామ సుబ్బారెడ్డి, సత్య ప్రసాద్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రమేష్, సుబ్బు, రఫీ, శివ, మాబు, రామయ్య, నాగేంద్ర , కుల్లాయి స్వామి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img