సిపిఐ
విశాలాంధ్ర-ఆత్మకూరు : మండల వామపక్ష ప్రతి పక్ష పార్టీలను అడ్డుకునే చీకటి జీవో నెంబర్ ఒకటి నిరద్దు చేయడం హర్షణీయమని సిపిఐ ఆత్మకూరు,మండల కార్యదర్శి సనప నీళ్లపాల రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగాఈ జీవో విఘాతంగా ఉందన్న హైకోర్టు రాష్ట్రంలో సభలురోడ్ షోలు ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ని తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను ప్రతిపక్షాలను అడ్డుకునేందుకే ఈ జీవో తెచ్చారని ఇలాంటి జీవోల వల్ల వామపక్షాలను ప్రతిపక్షాలను అడ్డుకొని వారిని నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. న్యాయవ్యవస్థలు ఇలాంటి జీవోలను తప్పుపడుతూనే ఈరోజు జీవో నెంబర్ ఒకటిని హైకోర్టు రద్దు చేయడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలు,ర్యాలీలు ధర్నాలు పాదయాత్రలు ఎన్ని చేసినా గత ప్రభుత్వాలు అడ్డుపెట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆంక్షలు అని విధిస్తున్నావ్ నీవు జీవో నెంబర్ వన్ తెచ్చిన సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ దీనిపైన పోరాడి హైకోర్టుకి వేసి జీవో నెంబర్ వన్ రద్దు చేయడం ఎంతో శుభ పరిమాణం అని పేర్కొన్నారు.