Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

జగనన్న ఆణిముత్యాలకు ఉరవకొండ విద్యార్థినీలు ఎంపిక

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అత్యంత ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించిన కె దేవి 975 ఎంపీసీ, ఆర్ పూజిత 910 ఎంపీసీ, స్రవంతి 770 హెచ్ ఈ సి విద్యార్థినిలు జగనన్న ఆణిముత్యాల కార్యక్రమానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మమత తెలిపారు. మంగళవారం ఉరవకొండలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కూడా తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ కళాశాలకు దీటుగా విద్యను బోధిస్తున్న ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేర్పించాల్సిన అవసరము బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆణిముత్యాలకు ఎంపికైన విద్యార్థినీలకు ఈనెల 25న జరిగే ముఖ్య అతిథుల సమావేశంలో ఒక్కో విద్యార్థికి 15 వేల రూపాయలు నగుదు తో పాటు మెమొంటోని కూడా అందించి సత్కరిస్తున్నట్టు ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img