Monday, February 6, 2023
Monday, February 6, 2023

జగనన్న తోడును సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర – బొమ్మన హాల్ : మండలంలో వివిధ గ్రామాల్లో చిరు వ్యాపారస్తులు జగనన్న తోడును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి ఏపీఎం సురేఖ తెలిపారు మండల కేంద్రమైన బొమ్మనహాళ్ లో వైకెపి కార్యాలయంలో జగనన్న తోడు ఆరో విడత క్రింద లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాఫీలను బుధవారం.  ఎంపీపీ పద్మచంద్రశేఖర్ రెడ్డి వైస్ ఎంపీపీ రమేష్ ఏపీఎం సురేఖ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు చిరు వ్యాపారులకు, సాంప్రదాయ వృత్తులు వారికి ఆరో విడత కింద 10వేలు చొప్పున కొత్తగా 361మంది సభ్యులకు అందజేశారు .ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర లేదు,కానీ మన వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలతో పాటు,ఇవ్వని హామీలను కూడా పార్టీలకు,కులమతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీధర గట్ట సర్పంచ్ యోగేశ్వర్ రెడ్డి వైస్ ఎంపీపీ రమేష్ చంద్రశేఖర్ రెడ్డి సీసీలు కాజన్న గౌసిద్దప్ప తిప్పేస్వామి ఎర్రి స్వామి యానిమేటర్లు,జగనన్న తోడు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img