టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంధ్ర గౌడ్..
విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో జగనన్న పాలనలో ప్రజలను కష్టాల్లో కూరుకుపోయారని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని పదో వార్డులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ జితేంద్ర గౌడ్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కష్టాల్లో కూరుకుపోయే విధంగా నిత్యవసర సరుకులు అనేక వాటిపై ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రస్తుత కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని గద్దె దింపుతానే కష్టాలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కేశప్ప,టిడిపి నాయకులు తలారి మస్తానప్ప, కసాపురం సర్పంచ్ అభ్యర్థి రంజాన్ ,మైనార్టీ నాయకులు బందా నవాజ్,నందీశ్వర్,మాజి కౌన్సిలర్ కురుబ శివన్న,టిఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కురుబ సురేష్,పులికొండ తదితరులు పాల్గొన్నారు.