Friday, June 9, 2023
Friday, June 9, 2023

జగనన్న విద్యా కానుక కిట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిల్వ చేసిన జగనన్న విద్యా కానుక కిట్లను శనివారం జిల్లా కలెక్టర్ గౌతమి పరిశీలించారు. కిట్లలోని బ్యాగ్స్, వస్త్రాలను నాణ్యత ప్రమాణాలను, రికార్డ్స్ను క్షుణ్ణంగా చూశారు. అనంతరం జగనన్న లేఔట్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ సందర్శించారు. జగనన్న లేఅవుట్లో నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో సాయిరామ్ , పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img