Monday, May 29, 2023
Monday, May 29, 2023

జగన్ పాలన దేశానికే ఆదర్శం

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

విశాలాంధ్ర -ఉరవకొండ: అర్హులైన పేదలందరికీ కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. శుక్రవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు.గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img