జెడ్పిటిసి సభ్యులు ఏసీ పార్వతమ్మ
విశాలాంధ్ర -ఉరవకొండ: అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి జగనన్నను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఉరవకొండ జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ అన్నారు. శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని సచివాలయం-3 పరిధిలో మాజీ ఎంపీపీ,సచివాలయ కన్వీనర్ ఏసీ ఎర్రిస్వామి ఆధ్వర్యంలో ఃజగనన్నే మా భవిష్యత్తుః కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి పార్వతమ్మ, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు,వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.జగన్మోహన్ రెడ్డి పాలనపై సర్వే నిర్వహించారు.అనంతరం ఆయా ఇంటి యజమానుల అనుమతితో ఃమా నమ్మకం నువ్వే జగన్ః అనే స్టిక్కర్లు లబ్ధిదారుల ఇంటికి, సెల్ ఫోన్లకు అతికించారు.జగనన్నకు అండగా నిలబడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ శంకరయ్య, నాయకులు జయరాం, సచివాలయ కన్వీనర్లు,గృహసారథులు, వలంటీర్లు,తదితరులు పాల్గొన్నారు.