విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త మందల మధుసూదన్ ఎస్సై ఫిలింసుకు క్వాలిఫై అవ్వడంతో, సమాచార అందుకున్న చిలకం మధుసూదన్ రెడ్డి గురువారం తన స్వగృహంలో తన వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కార్యకర్తకు అందజేశారు. డబ్బులు సద్వినియోగం చేసుకొని విజయవంతంగా తిరిగి రావాలని వారు దీవించారు. దీంతో మందల మధుసూదన్ సంతోషపడి చిలకం మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.