విశాలాంధ్ర – ధర్మవరం : జాతీయ క్రికెట్ జట్టుకు మండల పరిధిలోని నాగులూరు వద్దగల రూపా రాజా పీసిఎంఆర్ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని ఆ పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కూల్ స్పోర్ట్స్, కల్చరల్ అసోసియేషన్ తరపున యువన్ కుమార్ రెడ్డి, శరత్ సాయి.. అండర్- 17 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. జాతీయ క్రికెట్ జట్టు క్రీడలు మే నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఉత్తరకాండలో జరగనున్నాయని వారు తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధను కనపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్, డైరెక్టర్ రూప రాజా, కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ బృందం, ఎంపికైన విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.